Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర భూములను అమ్మేహక్కు కేంద్రానికి లేదు
- మోకాళ్లపై నడిచిన కాంగ్రెస్‌కు ప్రజలు నమ్మరు
- విలేకర్ల సమావేశంలో ఎంపీ బడుగు లింగయ్యయాదవ్
నవతెలంగాణ-మిర్యాలగూడ
యువత ఆశల్లో నీళ్లు చల్లే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారని, దీన్ని దేశవ్యాప్తంగా సైనికులు యువత వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.కేవలం నాలుగేండ్లపాటు పని చేయించుకొని ఆ తర్వాత ఉద్యోగవిరమణ ఇవ్వడం సరికాదన్నారు.దేశ రక్షణ విభాగం ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు.అలాంటి పథకాన్ని మోడీ తీసుకురావడం దురదష్టకరమన్నారు. భేషజాలకు పోకుండా ఈ పథకం లో కొన్ని చేర్పులు మార్పులు చేసి యువత కు ఉపయోగపడే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వన్ 40 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేంద్రానికి అప్పగించిందని అట్టి భూములను కేంద్రం అమ్మేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు.పేదల సంక్షేమం కోసం సీఎం కషి చేస్తున్నారని చెప్పారు.ఎమ్మెల్యే భాస్కర్‌రావు నాయకత్వంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివద్ధి పనులు చేశారని చెప్పారు.మిర్యాలగూడ మీదుగా వెళ్లే నారాయణాద్రి, నర్సాపూర్, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మిర్యాలగూడలో నిలుపుదల చేసేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ కుర్ర కోటేశ్వరరావు, చీర్రా మల్లయ్యయాదవ్, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, బాసానిగిరి, ఇలియాజ్, షోయబ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.