Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తల్లిదండ్రుల పోషణ బాధ్యతతో పాటు వారి ఆకాంక్షలు ఆరోగ్యాన్ని పరి రక్షించుట ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నారాయణ రామచంద్రారెడ్డి అన్నారు.ప్రపంచ వయోవద్ధుల వేధింపుల అవగాహన వారోత్సవాలలో భాగంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.నేటి యువతరం ప్రాశ్చాత్య నాగరికత మోజులో పడి భారతీయ సంస్కతి సాంప్రదాయాలను మరిచి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మరిచి ఎవరికి వారు చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయి తల్లిదండ్రుల పోషణ బాధ్యత మరిచి వారిని వేధిం పులకు గురిచేయడం లేదా వద్ధాశ్రమాలలో వదిలివేయడం కొన్ని కుటుంబాలలో జరుగు తుందన్నారు.సమాజంలో ఈ జాడ్యాన్ని రూపుమాపి యువతరాన్ని తల్లిదండ్రుల గొప్పతనాన్ని వారి అనుభవాలను పాఠాలుగా తీసుకొని ముందుకు వెళితే సమ సమాజాన్ని స్థాపించవచ్చని పేర్కొన్నారు.కనుక ప్రతి ఒక్కరిలో బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలలో అవగాహనను కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి పూలసెంటర్, అలంకార్ రోడ్డు, ఈద్గారోడ్, శంకర్ విలాస్సెంటర్, ఎంజీరోడ్లోని గాంధీబొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈ కర్యాక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల విద్యాసాగర్, ఉపాధ్యక్షులు రామకష్ణారెడ్డి, గజ్జల ధర్మారెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి వెంపటి పురుషోత్తం, సహాయ కార్యదర్శులు కక్కిరేణి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కొక్కుల మోహన్ రావు, గౌరవ అధ్యక్షులు వెంపటి మనోహర్, గౌరవ సలహాదారులు మల్లారెడ్డి, సుభాష్ సుజాత, సుగుణమ్మ, సరస్వతిబట్ల అన్నపూర్ణ,దాచేపల్లి సుజాత లక్ష్మి, గోవిందరెడ్డి, హమీద్ ఖాన్, చలమంద, బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, కందిబండ సూరయ్య, కొండ్లె రంగయ్య, లింగారావు పాల్గొన్నారు.