Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు.సోమవారం మండలంలోని బేతవోలు గ్రామంలో ఫర్టిలైజర్ షాపులలో తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్సు కలిగిన డీలర్ దగ్గరే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలని సూచించారు.విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత కొన్ని విత్తనాలను మొలక కట్టి 80 శాతం కంటే ఎక్కువ వచ్చినట్లుగా నిర్దారణ చేసుకోవాలన్నారు.విత్తనాలు కొన్న బిల్లు సంచి తప్పనిసరిగా పంట పూర్తయ్యేవరకు దాచుకోవాలన్నారు.ఇదే అదునుగా కొంతమంది మధ్యవర్తులు రాత్రి సమయంలో లేదా లైసెన్సు లేకుండా గ్రామాల్లోకి వచ్చి తక్కువ ధరకు విత్తనాలను అమ్ముతుంటారన్నారు.ఏదైనా నష్టం వస్తే అలాంటి మధ్యవర్తుల నుండి నష్టపరిహారం రాదన్నారు.ఈ కార్యక్రమంలో డీలర్లు బజ్జూరి ప్రభాకర్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు.