Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినా పన్నులతో లారీలను నడపడం మా వల్ల కాదంటూ, ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని ఉమ్మడినల్లగొండ జిల్లా లారీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావు అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు చిలుకూరు లారీ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నన్నెసాహెబ్ ఆధ్వర్యంలో పట్టణపరిధిలోని తమ్మర వద్ద గల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రవాణా రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అవులరామారావు మాట్లాడుతూ లాక్డౌన్, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణారంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిట్నెస్,గ్రీన్టాక్స్, క్వార్టర్టాక్స్, పోలీస్ చలానాలతో రవాణారంగంపై మోయలేని భారం మోపాయన్నారు.ఇక లారీలను నడిపే స్థితిలో ఏ ఒక్క యజమాని లేనందున సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వానికి లారీలను సరెండర్ చేస్తామన్నారు.ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సంక్షోభంలో ఉన్న రంగానికి చేయూతను అందించి ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో షేక్పెంటు సాహెబ్(పండు), ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవఅధ్యక్షులు పైడిమర్రి వెంకటనారాయణ, కార్యదర్శి కోడారువీరయ్య, కోశాధికారి గన్నప్రసాద్, జనరల్ సెక్రటరీ బాల గౌడ్, వర్కింగ్ సెక్రటరీ రామకృష్ణ, నాగిరెడ్డి, శ్రీనివాస్, కోటి, వెంకటేశ్వర్లు, సూరి, సంధాని తదితరులు పాల్గొన్నారు.