Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలపరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటిచూపును ఇచ్చేందుకు తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆశీస్సులతో తుంగతుర్తి ఎంపీటీసీ-2 చెరుకు సృజన పరమేష్ సహకారంతో మదర్‌థెరిస్సా కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత వైద్యులు తెలిపారు.సోమవారం మండలకేంద్రంలో మదర్ థెరిస్సా కంటి దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీటీసీ చెరుకు సృజన పరమేష్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ మండలప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకన్న, బొంకూరి మధు, మద్దెల మహేష్, బొంకూరు సైదులు, బొంకూరు శివ, ఎగురి శాంతయ్య, కృష్ణ, దేవదానం మనోజ్ ,వెంకటేష్, ప్రవీణ్, మధు, చంటి, సతీష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.