Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రైడే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత
- కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
వర్షకాలం సీజన్లో జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణాంతక వ్యాధుల కేసులు నమోదు కాకుండా వైద్యాధికారులు, సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినరుకృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో వైద్యాధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్షాకాలం సీజన్లో వచ్చే వ్యాధులపై చేపట్టబోయే చర్యలపై దిశ నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వర్షాకాలం సీజన్లో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడు వాపు, ఫైలేరియా వ్యాధులపై ప్రజలకు గ్రామాలలో వైద్యాధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లావ్యాప్తంగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యాక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి అందించాలని తెలిపారు.డ్రైడే నిర్వహణపై గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు చేపడుతామన్నారు.అన్ని మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో థిమోఫాల్స్ అందుబాటులో ఉంచి వినియోగించాలని పేర్కొన్నారు.ఇప్పటివరకు ఐదు విడతలో పల్లెప్రగతి, నాలుగు విడతాలలలో పట్టణ ప్రగతి చేపట్టి పరిశ్యుధ్యనికి అధిక ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు.ముఖ్యంగా ఈ సీజన్లో ప్రాణాంతకమైన వ్యాధులు ప్రజలకు సోకకుండా ప్రతి ఇంటితో పాటు పాఠశాలలో, ప్రభుత్వ, ప్రయివేటు వసతి గృహాలలో, అంగన్వాడీ కేంద్రలలో దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించాలన్నారు. ఫాగింగ్ సమయంలో ప్రతి ఇంటి తలుపులు తెరిచి ఉంచేలా ముందుగా అవగాహన కల్పించాలని తెలిపారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు తొలగించాలని, దోమల లార్వా లను కంట్రోల్ చేయడానికి గంబుషియా చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.చిలుకూరు మండలంలోని బేతావోలు గ్రామంలో వ్యాధులు ఎక్కువగా ప్రభాలుతున్నాయని, బేతావోలు గ్రామాన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించామన్నారు.గ్రామంలో ప్రత్యేక పరిశ్యుధ్యం చేపట్టి కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత వైద్యాధికారులకు సూచించారు.టైగర్ మస్కిటోతో డెంగ్యూ ఎక్కువగా సోకుతుందని వీటి ప్రభావం ఎక్కువగా పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని, దీని నిర్ధారణ కొరకు రోజుకు దాదాపు 90టెస్టులు ఎలిసా టెస్టులు నిర్వహించాలన్నారు. డెంగ్యూ పరీక్షల పేరిట ప్రైవేటు ఆసుపత్రులలో ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అన్ని ధవాఖానాలలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచిందని ప్రజలు ప్రయివేట్ ఆస్పత్రుల్లో కాకుండా ప్రభుత్వాస్పత్రిలో సీజనల్ వ్యాధులపై చికిత్స తీసుకువాలని తెలిపారు.ముఖ్యంగా వానాకాలం సీజన్లో రిస్క్ ప్రాంతాలను గుర్తించి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, రిస్క్ ప్రాంతాల్లో వైద్యాధికారులు ముందస్తుగా పర్యటించి నివేదికలు అందించాలని వైద్య, సంబందించిన అధికారులను ఆదేశించారు.పందులను పెంచే కుటుంబసభ్యులకు సీజనల్ వ్యాధులు ప్రభాలకుండా తగిన జాగ్రత్తలు సూచించాలని,అన్ని మున్సిపల్, గ్రామ పంచాయతీ లలో పందుల కొరకు స్థల పరిశీలన చేసి నివేదికలను అందించాలని కోరారు. ప్రజలలో సీజనల్ వ్యాధుల పట్ల కళజాతా కార్యాక్రమలు చేపట్టాలన్నారు.జిల్లాలో ఇప్పటివరకు బోధకాలతో ఇబ్బంది పడుతున్న 1800 మందికి రూ.2వేల చొప్పున అందిస్తున్నామని మరో 200మందిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించమని తెలిపారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు నిరంతర ప్రక్రియ చేపట్టాలని అన్ని పీహెచ్సీలలో మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందించాలని చెప్పారు.ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ కోటాచలం, జిల్లా ప్రోగ్రాం అధికాది డాక్టర్ సాహితీ, డీపీఓ యాదయ్య, జిల్లా మశ్యు శాఖ అధికారిని సౌజన్య, సంక్షేమఅధికారులు శంకర్, జ్యోతిపద్మ, అనసూయ, మున్సిపల్ కమిషనర్లు, విద్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.