Authorization
Thu March 20, 2025 11:53:10 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
ఉపాధి హామీ చట్టం కింద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉపాధికూలీలకు నెలలు గడుస్తున్నా చేసిన శ్రమకు వేతనం ఇవ్వడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శి ంచారు.మండలంలోని వెలిశాల గ్రామంలో మంగళవారం ఉపాధిహామీ పని ప్రదేశాన్ని ఆయన సందర్శించి కూలీలతో మాట్లాడారు.ఉపాధిలో పనిచేస్తున్న కూలీలకు రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని, సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.ఉపాధిహామీచట్టం అధికారుల నిర్లక్ష్యం సరిగా అమలు జరగడం లేదని విమర్శించారు.ఈచట్టంలో ఉన్న అంశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు.కూలి చేస్తున్న కూలీలకు ప్రతిరోజు వేతనం 30 నుండి 50 రూపాయలు మాత్రమే పడుతుంద న్నారు.పెరుగుతున్న ధరలతో ఇస్తున్న కూలీ సరిపోవడం లేదన్నారు.పెరిగిన ధరలకనుగుణంగా కూలీలకు రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.పని ప్రదేశంలో సౌకర్యాలు మంచినీరు, టెంటు,మెడికల్ కిట్టు, తదితర సౌకర్యాలు ఇవ్వాలని చట్టాలున్నా కనీసం అమలు జరగడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండలకార్యదర్శి పడ మటిం టినగేష్, మండలనాయకులు సోమన్న, సీపీఐ(ఎం) నాయకులు కడారి లింగయ్య, రాములు, చిత్తలూరు సోమయ్య, మేట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.