Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 26వ తేదిన జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.సోమవారం లోక్‌అదాలత్ నిర్వహణపై రాష్ట్ర న్యాయ సేవా సంస్థ చైర్మెన్ జిల్లాల అధికారులు, న్యాయసంస్థ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫ రన్స్‌లో ఆయన మాట్లాడారు. పలు సూచనలు, సలహాలు అందించారు. కోర్టు కేసుల్లో రాజీ కుదిరే అవకాశం ఉన్న కేసుల్లో కక్షిదారులు, బాధితులు రాజీ చేసు కోవాలన్నారు.రాజీమార్గమేరాజమార్గమని తెలి పారు.లోక్‌అదాలత్‌పై అవ గాహన కల్పిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రెహమాన్, నాగభూషణం,సీఐలు శ్రీనివాస్, ఆంజ నేయులు, రాజేష్, నాగర్జున, నర్సింహ,డీసీఆర్బీ సిబ్బంది, ఐటీ కోర్ పాల్గొన్నారు.