Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరిడేపల్లి : ఆజాదీ కా అమృత్ మహౌత్సవాలలో భాగంగా శ్రీ అరవింద కృషి విజ్ఞానకేంద్రంలో మండలపరిధిలోని గడ్డిపల్లిలో మంగళవారం సమర్థవంతమైన, సమతుల్య ఎరువుల యాజ మాన్యంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ మాట్లాడారు.రైతులు అధికమొత్తంలో ఎరువులు వాడడం ద్వారా భూసారం దెబ్బతింటుందన్నారు.రైతులు సరైన పద్ధతిలో, సరైన మోతాదులో ఎరువులు వాడడం ద్వారా అధికదిగుబడులు సాధించొచ్చన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి డి.రామారావునాయుక్ మాట్లాడుతూ రైతులకు, వివిధ రకాల రసాయన ఎరువుల వాడకంలో మెళకువలు, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం, సమతుల్య ఎరువుల వాడకం గురించి. సేంద్రియ ఎరువులు ఆయన వర్మికంపోస్ట్, జీవన ఎరువులు,పచ్చిరొట్ట ఎరువులు ప్రాముఖ్యత, గురించి రైతులకు వివరించారు.భూసార ఆరోగ్యపత్రాల వివరాలను రైతులకు వివరించారు.పంటల విభాగ వివిధ వంటలలో చేయవల్సిన పనులు, కలుపు నివారణ, పంట ఆవశేషాలను కంఫర్ట్‌గా మార్చుట గురించి వివరించారు.నానో ద్రవరూప యూరియా ఎరువులపై అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో కేవీకే శాస్త్రవెత్తులు, బి.లవకుమార్, కిరణ్, సురేష్, వెంకట్, సీహెచ్.నరేష్, టి.మాధురి, ఎన్.సుగంధి, పెన్‌పహాడ్ మండల వ్యవసాయాధికారి కృష్ణసందీప్, ఆత్మకూర్‌ఎస్ ఎఫ్‌పీఓ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీఈఓ ఎం.క్రాంతి, పాల్గొన్నారు.