Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో మంగళవారం నాయకులు పగిడిమర్రి మట్టపల్లిరావు విగ్రహన్ని ఎమ్మెల్యే బొల్లంమల్లయ్యయాదవ్ మంగళ వారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగిడిమర్రి మట్టపల్లిరావు గ్రామ అభివద్ధి, సంక్షేమం కోసం నిరంతరం తపించిన గొప్ప నాయకుడన్నారు.ఆయన సేవలను స్మరించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కషిచేసిన నాయకుడన్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ అందించిన గ్రామం తొగర్రాయి అన్నారు.తనకు రాజకీయ పునర్జన్మను ఇచ్చిన గ్రామమన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.కాగా టీఆర్ఎస్ నాయకులు, మట్టపల్లిరావు అభిమానులు ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ చింత కవితరాధారెడ్డి, జెడ్పీటీసీ కష్ణకుమారి శేషు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్,సర్పంచ్ దొంగలలక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ గ్రామఅధ్యక్షుడు అమరబోయిన శ్రీనివాస్‌యాదవ్,మాజీ సర్పంచులు పూసపాటి రామారావు,కన్నెబోయిన వెంకన్న,పగిడిమర్రి చంద్రకళ,మాజీ ఎంపీటీసీ యలమర్తి ఏడుకొండలు, మాజీ సొసైటీ చైర్మెన్ గాయం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మిరియాల అంజయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు గుండపునేని ప్రభాకర్, కాసాని రమాదేవి, యాదాద్రి తదితరులు పాల్గొన్నారు.