Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని రామలక్ష్మీపురం, ఎర్రవరం, తొగర్రాయి, గణపవరం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, పల్లెప్రకృతి వరాలు, వైకుంఠదామాలు, పశు వైద్యశాలను ఆయన ప్రారంభించారు.గ్రామాల్లోకి ఎమ్మెల్యే రావడంతో టీిఆర్‌ఎస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.రామలక్ష్మీపురం గ్రామంలో ఎమ్మెల్యే వివాహ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేక్‌ను కట్ చేశారు.అనంతరం మహిళలతో కలసి నృత్యాలు చేశారు.తొగర్రాయి గ్రామంలో సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో తొగర్రాయి గ్రామం తనకు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైనదన్నారు.ఆ గ్రామానికి తగిన ప్రతిఫలం అందిస్తానని, దళితబంధు,గొర్రెల పంపిణీ కార్యక్రమం సాధ్యమైన అన్ని ఇస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితరాధారెడ్డి, జెడ్పీటీసీ కృష్ణకుమారి శేషు, వైస్‌ఎంపీపీ మల్లెలరాణి, మండల అధ్యక్షులు కాసాని వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి శెట్టి సురేష్‌నాయుడు, సర్పంచులు పొట్ట శ్రీ విజయకిరణ్, పాముల మస్తాన్, సుబ్బారావు, అంబడిపూడి స్వరాజ్యం, టీఆర్ఎస్ నాయకులు అన్నం వెంకట్‌రెడ్డి, వీరారెడ్డి, గోపి, గ్రామఅధ్యక్షులు అంజిరెడ్డి పాల్గొన్నారు.