Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతలపాలెం: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని యూపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, గత సంవత్సరం 4వ తరగతి చదివిన వారు గురుకుల పాఠ శాలలో 5వ తరగతి సీట్లు సంపాదించారన్నారు.కావున పిల్లలను రూ.వేలకు వేలు పెట్టి ప్రయివేటు పాఠశాల చేర్పించ కుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు వాటర్ కోసం సంపులైన్ మార్కింగ్ ఇచ్చి విద్యుత్ కోసం మరమ్మతులు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు, గ్రామపెద్దలు, పాల్గొన్నారు.