Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లింగ నిర్దారణ చట్టరీత్యా నేరం
- వైద్యులు నిబద్ధతతో పనిచేయాలి
- కలెక్టర్ టి.వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా నిబద్ధతతో ప్రత్యేక కృషి చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లింగ నిర్దారణ,సాధారణ ప్రసవాలపై నిర్వహించిన సమా వేశంలో ఆయన అదనపు కలెక్టర్ పాటిల్హేమంత్కేశవ్తో కలిసి మాట్లా డారు.జూన్ మాసంలో ప్రభుత్వాస్పత్రుల్లో 69 శాతం సాధారణ ప్రసవాలు జరిగాయన్నారు.సాధారణ ప్రసవాలు మరింతఎక్కువ జరిగేలా ప్రజలలోఅవగాహన కల్పించాలని సూ చించారు.వైద్యాధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఇకపై అన్ని ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తామన్నారు.గర్భం ముందుగాని, గర్భంలో ఆడ లేక మగ లింగ నిర్దారణ చేయడం నిషేధమన్నారు.బ్రూణ హత్యల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఆడ పిల్లల సెక్స్‌రేషియో పెంచాలని సూచించారు. ముఖ్యానంగా రేడియాలజిస్టు, గైనకాలజిస్టులకు సూచించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్కేంద్రాలలో ఎట్టి పరిస్థితిలో గర్భంలో ఆడ, మగ ఉన్నదని తెలుసుకోకూడదన్నారు.అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.లింగనిర్దారణ చేసినట్నటయితే జిల్లా ఆస్పత్రి రిజిస్ట్రేషన్ అధికారికి సమాచారం ఇవ్వాలని, ఈవిషయన్ని గోప్యంగా ఉంచుతా మన్నారు.జిల్లాలో ప్రయివేట్ఆస్పత్రుల యాజమాన్యాలు విధిగా ప్రభుత్వ విధానాలు పాటిస్తూ సహకరించాలన్నారు.అనుమతిలేని, డాక్టర్ లేని ఆస్పత్రుల్లో గర్భ స్రావములు నిర్వహిస్తునట్లు తమ దష్టికి వచ్చింద న్నారు.ఇప్పటికే గట్టి నిఘా ఉంచామన్నారు.గ్రామీణ వైద్యులపై నిఘా ఉంచి చట్టపరంగా చర్యలు చేపడుతామన్నారు.జిల్లాలోని ప్రభుత్వ , ప్రయివేట్ ఆస్పత్రుల్లో సాధారణప్రసవాలు పెంచాలన్నారు.అనంతరం ప్రయివేట్ ఆస్పత్రుల వారీగా ప్రసవాలపై సమీక్షించారు.అనంతరం డీఎంహెచ్ఓ కోటాలచం మాట్లాడుతూ చట్టపరమైన సూచనలు పాటించని ఆస్పత్రి ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామన్నారు.ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటిస్తూ తెలంగాణ ఆలోపతిక్ ప్రయివేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చట్టం, గర్భస్థ పూర్వ లింగనిర్దారణ పరీక్షల నిషేధచట్టం 1994, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెసీ చట్టం 1971 మూడు చట్టాలను కఠినంగా అమలు చేస్తా మన్నారు.ఈ సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్‌రెడ్డి, జనరల్ ఆస్పత్రి స్త్రీల విభాగ అధిపతి హెచ్ఓడీి ఎ.సుజాత, డిప్యూటీ డీఎం హెచ్ఓలు డా.హర్షవర్ధన్,డా.నిరంజన్, ప్రోగ్రాం అధికారి డా.జయ శ్యామ్ సుందర్, మీడియా అధికారి అంజయ్య, ప్రయివేట్ వైద్యులు పాల్గొన్నారు.