Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
రాజకీయ అవగాహనతోనే రైతుల సమస్యలకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు.మంగళవారం పట్టణంలోని జంగిడిబజారులో పట్టణ రైతు మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై శ్రద్ధ చూపడం లేదన్నారు.సమగ్ర పంటల బీమాపథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పినా అది ఆచరణలో సాధ్యం కాలేదన్నారు.రైతులు అభివద్ధి చెందినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.నేటికీ దేశంలోనే అత్యధిక జనాభా వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతుసంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, రైతు సంఘం కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి గుండువెంకటేశ్వర్లు, జడశ్రీనివాస్, వై.రమేశ్, మామిడి వెంకయ్య పాల్గొన్నారు.