Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలడుగునాగార్జున
నవతెలంగాణ-మిర్యాలగూడ
కులవివక్షవ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా 8 వ మహాసభలు 19,20 తేదీలలో హాలియా పట్టణంలో దిగ్విజయంగా ముగిశాయి.మంగళవారం మిర్యాలగూడలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడారు.ఈనెల 19,20వ తేదీలలో హలియాలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగాయన్నారు.19న ఎంసీఎం కళాశాలలో దళితులసంక్షేమం- ప్రభుత్వాల పాత్ర' అనే అంశంపై సెమినార్ నిర్వహించామన్నారు.20న మహసభలకు ముఖ్యఅతిధిగా సంఘం వ్యవస్థాపకులు సంఘం రాష్ట్ర అద్యక్షులు జాన్‌వెస్లీ పాల్గొని ప్రారంభ ఉపాన్యాసం చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 మండలాల నుండి 250 మందీ ప్రతినిదులు పాల్గోన్నారు. ధళితులు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో నిర్వహిం చాల్సిన ఉద్యమాలగురించి సమగ్రంగా చర్చిం చామన్నారు.దళితబంధు సాధనకు జిల్లావ్యాప్తంగా జీపుజాతా,అనంతరం వేలాదిమందితో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ప్రదర్శన చేయాలని మహసభలో తీర్మానం చేయనైనదన్నారు.జిల్లాలో డంపింగ్‌యార్డులు, పల్లెప్రకృతివనాలు, మార్కెట్ యారుల పేర భూములు గుంజుతున్నారని, దళితుల భూముల జోలికొస్తే సహంచేది లేదని అన్నారు. సంక్షేమ హస్టల్స్ ,గురుకులాలు, లో నెలకొన్న సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించీ ఆందోళన పోరాటాలు మిలిటెన్సీ ఉద్యమాలు చేయాలన్నారు.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ధళితులకు పేదలకు మెరుగైన వైద్యం అందించుటకు దశలవారీ ఉద్యమాలు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లా నూతనకమిటీని ఏకగ్రీవంగా 41మందితో ఎన్నుకున్నామన్నారు.అధ్యక్షులుగా కొండేటి శ్రీను(నిడమనూరు,) ఉపాధ్యక్షులుగా రెమిడాల పరుశరాములు(మిర్యాలగూడ),జిట్థనగేష్ (చిట్యాల),దైదా శ్రీను(త్రిపురారం), పెరిక విజరుకుమార్(పీఏపల్లి), ప్రధానకార్యదర్శిగా పాలడుగు నాగార్జున (నల్లగొండ), సహాయ కార్యదర్శులుగా గాదె నర్సింహ (నల్లగొండటౌన్), గండమల్ల రాములు(తిప్పర్తి ),బొట్టు శివకుమార్(చండూరు),కోడిరెక్క రాధిక (మిర్యాలగూడ), నూతన జిల్లా కమిటీ సభ్యులుగా కోడిరెక్కమల్లన్న, బొల్లంపల్లి పాపారావు, దైదాదేవయ్య, తక్కెళ్లపల్లి శ్యామ్‌కుమార్, మహంకాళిశ్రీనివాస్, తక్కెల్లపల్లి ఏసుబాబు,బొల్లు రవీందర్, గంటెకంపు రమణయ్య, పర్వతంఅంజిబాబు, పోలెపాక చంద్రశేఖర్, దండురవి, హెచ్చు మారెమ్మ, తెలగమల్లమాధవి, చిలుముల రామస్వామి, వంటెపాక కృష్ణ, వంటెపాక అయోధ్య, నేరెళ్ల నర్సింహ, ఇరిగి సంజీవ, ఇంజమూరి శివ, ఇరిగినారాయణ, దొంతాలనాగార్జున, దోరెపల్లి మల్లయ్య, నల్లరామస్వామి, మండలి యుగంధర్, మేడివెంకటయ్య, పెద్దమామిడియాదమ్మ, గంటెల కలమ్మను ఎన్నుకున్నారు.