Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
నవతెలంగాణ- నల్లగొండ
ప్రయివేటు పాఠశాలల్లో అధిక ఫీజులు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆ సంఘ: నల్గొండ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు రెన్యువల్ చేయని పాఠశాలలను సీజ్ చేయాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో ఫిట్నెస్ లేని బస్సులను తొలగించాలనారు. కరోనా నేపథ్యంలో లో అనేక కుటుంబాలు ఆర్థికంతో సతమతమవుతూ ఉంటే ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇదే అదునుగా భావించి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అడ్మిషన్ ఫీజు పేరుతో పుస్తకాల పేరుతో యూనిఫాం పేరుతో విద్యార్థుల రక్తాన్ని తాగుతున్న ప్రయివేటుకార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దందా బందు కావాలన్నారు. గుర్తింపు రెన్యువల్ చేయకుండా విద్యాధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరించడం సరైంది కాదన్నారు. తక్షణమే గుర్తింపు రెన్యువల్ చేయని పాఠశాలలను సీజ్ చేయాలని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి రేణుక, రావణ్ సిద్ధార్థ, పవన్ సంతోష్ ,అశోక్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.