Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేందర్ ప్రథమ వర్థంతి సందర్భంగా రక్తదాన శిబిరం
- ప్రారంభించిన చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -వలిగొండ
వేముల మహేందర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు కమ్యూనిస్టు నాయకులు ప్రజా పోరాటాలు కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ముందుంటారన్నారు. వేముల మహేందర్ ప్రథమ వర్థంతి సందర్భంగా మంగళవారం స్థానిక శివ సాయి ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ మండల కమిటీ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ తెలిపారు. మహేందర్ వర్థంతి సందర్భంగా 40 మంది యువకులు రక్తదానం చేయడం అభినందనీయ మన్నారు. మహేందర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిన్ననాటినుండే ఎర్రజెండా చేతపట్టి చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలే పరిష్కారంగా పని చేశారన్నారు. ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కషి చేశారని తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ జిల్లా చైర్మెన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి మాట్లాడుతూ మహేందర్ వైస్ ఎంపీపీగా, పార్టీ నాయకునిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కొనియాడారు. భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తన సహకారం అందిస్తానని తెలిపారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిరి పంగి స్వామి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య ,గడ్డం వెంకటేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, నాయకులు తుర్కపల్లి సురేందర్, శ్రీశైలం రెడ్డి, రామచంద్ర, శ్రీనివాస్ ,మెరుగు వెంకటేశం, కొండె కిష్టయ్య ,వాకిటి వెంకటరెడ్డి, గాజుల అంజనేయులు, ఏలే కష్ణ ,దుబ్బ లింగం, మొగిలి పాక గోపాల్, సురేష్, గర్దాస్ నరసింహ ,మధు, స్వామి, ముకుంద ,సంజీవ ,నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టు కార్యకర్తలకు నిలువెత్తు నిదర్శనం వేముల మహేందర్
భువనగిరి: కమ్యూనిస్టు కార్యకర్తలకు నిలువెత్తు నిదర్శనం వేముల మహేందర్ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. వేముల మహేందర్ ప్రథమ వర్థంతి సభను జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 33 ఏండ్లపాటు ప్రజల పట్ల అంకితభావంతో, పార్టీ పట్ల ఆచెంచేలా విశ్వాసంతో, ఎలాంటి వ్యాపకాలు లేని పూర్తికాలం కార్యకర్తగా తన జీవితాన్ని మహేందర్ గడిపాడన్నారు. తెల్లటి బట్టలతో నల్లటి ముఖం మీద మల్లెపూవులాంటి చిరునవ్వుతో అందరిని ఆప్యాయంగా పలకరించే నైజం ఆయన సొంతంమన్నారు. కులం, మతం, ప్రాంతం పార్టీలతో సంబంధం లేకుండా సహాయం కోసం వచ్చిన వారిని అక్కున చేర్చుకునే మంచితనం కలివిడితత్త్వం ఆయనకున్న గొప్పతనం, ఎంతటి కష్టాలు వచ్చిన ఏమాత్రం జనకకుండా ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ఒకటికి రెండుసార్లు పదే, పదే, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఆయనకున్న ప్రత్యేక గుణమన్నారు. తప్పుడు పద్ధతులకు లోనైనా వారికి వాస్తవ విషయాన్ని అర్థం చేయించడంలో వారికి వ్యక్తిగతంగా నచ్చచెప్పడంలో ఆయనకు ఆయనే సాటి,తోటి వారి మంచి లక్షణాలను ప్రోత్సహించడంలో,వారి లోపాలను గుర్తు చేసి తొలగించడంలో ఆయన నేటి తరం ఓ మంచి కమ్యూనిస్టున్నారు. పార్టీ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులుగా, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులుగా , పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూలీ పోరాటాన్ని,పేదల ఇండ్లు,ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారం కోసం పనిచేశారన్నారు. ఆయన ఆదర్శాలను ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని,నీతి,నిజాయితీ నిబద్ధతను ముందుకు కొనసాగించడమే మొదటి వర్ధంతి సందర్భంగా ఆయనకిచ్చే ఓ ఘనమైన నివాళి అన్నారు. ఈ సభలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు మాయ కష్ణ నరసింహ గడ్డం వెంకటేష్ జిల్లా నాయకులు పీర్లపల్లి ముత్యాలు వెంకటేష్ లక్ష్మయ్య షాహిద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.