Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే అధికారి
నవతెలంగాణ -నల్లగొండ
హైదరాబాద్ రోడ్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ప్రారంభించే విషయంలో మంగళవారం రైల్వే శాఖ .. గుంటూరు డివిజన్ కు చెందిన ఉన్నతాధికారులు. అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్. శ్రీనివాస్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సుదర్శన్ రెడ్డి, డిన్నర్ సెక్యూరిటీ కమిషనర్ సత్య హరి ప్రసాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్చించారు. అనంతరం శాసనసభ్యులు కంచర్ల, తో కలిసి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో.. రైల్వే ఉన్నతాధికారులకు,జిల్లా కలెక్టర్కు ఎట్టిపరిస్థితుల్లోనూ సింగిల్ వెంట్ అండర్ బ్రిడ్జి అంగీకరించే ప్రసక్తి లేదని కంచర్ల స్పష్టం చేశారు. పరిస్థితిని గమనించిన రైల్వే అధికారులు, కేంద్ర అధికారులతో మాట్లాడి ఇక్కడి పరిస్థితి ని వివరించారు.మళ్ళీ కలెక్టర్, ఎమ్మెల్యేతో చర్చించిన అనంతరం అండర్ బ్రిడ్జి రెండువైపుల 11 మీటర్లు ఉండేవిదంగా డబుల్ వెంట్ అండర్ బ్రిడ్జి లు నిర్మాణం చేయాలని ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు జెర్రిపోతుల భాస్కర్ గౌడ్, మారగోని గణేష్, నాయకులు,రావుల శ్రీనివాస్ రెడ్డి రైల్వే ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల పనులను వెంటనే పూర్తి చేయాలి
నల్గొండకలెక్టరేట్ : మన ఊరు ,మన బడి, మన బస్తీ-మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల గ్రౌండింగ్ పూర్తి అయిన చోట వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో నల్లగొండ నియోజకవర్గంలో మన ఊరు-మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో జరుగుతున్న, జరగాల్సిన పనులపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మడలాల వారీగా స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు , హెడ్ మాస్టర్లు, సర్పంచ్లు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్లు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను అభివద్ధి చేసి పిల్లలకు అవసరమై అన్ని సౌకర్యాలను కల్పించాన్నారు. జిల్లాలో 517 పాఠశాలలను మొదటి దశలో ఎంపిక చేసి కొన్ని చోట్ల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అందులో భాగంగా నల్లగొండ నియోజకవర్గంలో మొత్తం 71 పాఠశాలలను ఎంపిక చేయగా 17 పాఠశాలలో పనులు ప్రారంభమై వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో ఎండీపీఓలు, ఎంఈఓలు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి హెడ్ మాస్టర్లు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్ సర్పంచ్లను సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించాలని తెలిపారు. మండలస్థాయి అధికారులు టార్గెట్ పెట్టుకుని పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 30 లక్షలలోపు ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని, 30 లక్షల కంటే ఎక్కువ అంచనాలు ఉన్న పనులను టెండర్ల ప్రక్రియ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్లు పనులు చేయని పక్షంలో స్థానిక ప్రజాప్రతినిధులైన సర్పంచ్లు, కౌన్సిలర్లతో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారం రోజులకోసారి జరిగిన పనుల ప్రగతికి సంబంధించిన రిపోర్టులు, పొటోలు విధిగా డీఈఒకు పంపించాలని ఆయన తెలిపారు.నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మన బడి బాగుపడితే మన ఊరు బాగుపడినట్లైనని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో గుడి ఎలాగో బడిని కూడా అలాగే భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి, డీఈఓ భిక్షపతి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రెమ్ కరణ్ రెడ్డి, అర్అండ్బీ ఈఈ నరేందర్ రెడ్డి, విద్య,మౌలిక సదుపాయాల సంస్థ ఈ ఈ అనిత, తదితరులు పాల్గొన్నారు.