Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ సీపీఐ కౌన్సిలర్ల బృందం మున్సిపల్ కమిషనర్ చైర్మెన్ల మంగళవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ కౌన్సిలర్లు బబ్బురి మౌనిక ,దండ బోయిన అనిల్ ,కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య లు మాట్లాడుతూ మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా చెక్ పోస్ట్ వద్ద ఉన్న పైప్. లైన్ పూర్తిగా డ్యామేజ్ అయినందున తక్షణమే డ్రయినేజీకి మరమ్మతు చేయాలన్నారు.గుండ్లపల్లి గ్రామంలో ఓకే హాల్లో హెల్త్ సెంటర్ ఉందని మరో గది నిరుపయోగంగా ఉన్నందున దాన్ని మున్సిపల్ తీసుకుని ఉపయోగించు కోవాన్నారు.గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కాకుండా బాత్రూంలో ఏర్పాటు చేయాలని కోరారు. అంగడిలో ఉన్న రెండు రూములు కూడా సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు పట్టణంలో కుక్కలు ఎక్కువ ఉన్నందున ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కోరారు.