Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-వేములపల్లి
యుద్ధప్రతిపాదికన లిఫ్టుల మరమ్మతులు చేపట్టాలని రైతుసంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.మంగళవారం మండలంలోని యల్ 16 ఎత్తిపోతల పథకాన్ని ఆయకట్టు రైతులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు.సాగర్ ఎడమకాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు.ఎత్తిపోతల పథకాల పట్ల అధికారులు,పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.ఖరీఫ్ సీజన్లో సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేసే సమయం ఆసన్నమవుతున్నప్పటికి నీటివిడుదలపై స్పష్టమైన ప్రకటన లేదన్నారు.ఒకవైపు తొలకరి చినుకులు పడడంతోరైతులు నారుమళ్ళకు సిద్ధపడుతున్నారన్నారు.కానీ ఎడమ కాల్వ పైన ఉన్న ఎత్తిపోతలపథకాలలో మోటార్లు,పంపులు,స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు.ఎత్తిపోతల పథకాలలో ఏ ఒక్కటి నడిచే పరిస్థితి లేదన్నారు.లిఫ్టులు అస్తవ్యస్తంగా ఉండడంతో చివరిభూములకు నీరు పోయే పరిస్థితి లేదన్నారు.ఒకవైపు కాల్వలు ముండ్ల పొదలతో, పూడిపోయిన మట్టితొ కాల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. పైపులైన్లపై చెట్లు పెరిగి పైపులైన్లు పగిలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.సిబ్బంది లేకపోవడంతో లిప్టుల నిర్వహణభారం రైతులపై పడుతుందన్నారు.లిఫ్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.అధికార యంత్రాంగం లిఫ్టుల మరమ్మతులు చేయించుటకు అవసరమగు నిధుల మంజూరుకోసం నివేదిక పంపించాలన్నారు.నిధుల మంజూరు కోసం ఈనెల 27న నల్గగొండలోని ఐబీ, సీఈ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయలన్నారు.ఎత్తిపోతల రైతాంగం పెద్దఎత్తున పాల్గొని నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలొ వైస్‌ఎంపీపీ పాదూరు గోవర్థన, సీపీఐ(ఎం)మండల కార్యదర్శి పాదూరు శశిధర్‌రెడ్డి, వ్యవసాయకార్మికసంఘం కార్యదర్శి రెమడాల భిక్షం, రైతుసంఘం మండల అద్యక్షుడు వల్లమల్ల యల్లయ్య,లిఫ్ట్ చైర్మెన్దేశిరెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీతారాంరెడ్డి, లింగయ్య, వెంకన్న,రాములు పాల్గొన్నారు.