Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నేడు ప్రపంచసంగీత దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా జిల్లా బాలభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటరాజ స్వామి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. తదనంతరం చిన్నారులతో వాయిద్యసంగీత కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించారు.ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణ వెనుక కషి చేసిన మహానుభావులను స్మరించుకుంటూ, పెద్దలు చూపిన మార్గంలో ప్రయాణం విజయాలు సాధించాలన్నారు.విద్యతో పాటు లలితకళల శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.తద్వారా విద్యలో చురుకుతనం, సృజనాత్మకత పెరిగి బాగా రాణిస్తారన్నారు.ఆరోగ్యం కోసం మంచి జీవన శైలి ఏర్పరచుకునేందుకు యోగా అందరూ బాల్యం నుంచే అలవర్చు కోవాలన్నారు.సిబ్బంది దాసరి ఎల్లయ్య, ఉమా, సత్యనారాయణసింగ్, అనిల్, సాయి, వీరునాయుడు, పద్మ, సునీత, స్టూడెంట్స్,పేరెంట్స్ పాల్గొన్నారు.