Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన ఆశయసిద్ధికి అనుగుణంగా కేసీఆర్ పాలన
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్‌లాంటి వారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కొనియాడారు.తెలంగాణారాష్ట్ర సాధన కోసం జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు. దివంగత ఆచార్య జయశంకర్ సార్ 11వ వర్థంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.తెలంగాణను ఏపీలో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. అటువంటి మహానుభావుడి సంకల్పసిద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారన్నారు.ఈ రోజున సార్ జీవించి ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాను కన్న కలలు సాకారమవుతున్నందుకు సంబూరపడేవారన్నారు.తెలంగాణ వెనుక బాటుకు గురైన ప్రాంతం కాదని, వెనుకబాటుకు నెత్తివేయబడిన ప్రాంతమంటూ వేల సభలలో జయశంకర్ సార్ చేసిన ఉపన్యాసాలను మంత్రి గుర్తుచేశారు.అద్భుతమైన విజన్,అంతకుమించి చక్కటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోటే రాష్ట్రం అన్ని రంగాలలో అభివద్ధి సాధిచిందన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్,మున్సిపల్, మార్కెట్ చైర్మెన్లు అన్నపూర్ణ, ఉప్పల లలిత, వైస్‌చైర్మెన్ పుట్ట కిషోర్, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ జీడిభిక్షం, ఎంపీపీ నెమ్మాది భిక్షం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి బాలసైదులుగౌడ్, బైరువెంకన్న, భాష, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.