Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా రెండో విడత గొర్రెల పంపిణి తక్షణమే చేపట్టి ,లబ్ధిదారులు నచ్చిన చోట ,మెచ్చిన గొర్రెలు కొనుగోలు చేసేందుకు అవకాశాలు కల్పించాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో మంగళవారం గొర్ల కాపరుల సంఘం సభ్యులతో కలిసి మండల డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం పూర్తి విఫలమయ్యిందని విమర్శించారు.రెండో విడత గొర్రెల పంపిణీ కోసం లబ్ధిదారులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారన్నారు.ఆలేరు మండలంలో 600 పైగా యూనిట్లు రావాల్సి ఉందన్నారు.జిల్లాలో ఖాళీగా ఉన్న పశువైద్య సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని,జీవాలకు సీజనల్ గా వస్తున్న వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని,వీధి కుక్కల బారినుండి జీవాలను కాపాడుటకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ నవీన్,బండ శ్రీనివాస్,ఆల్ల వెంకటేశ్,కారె శ్రీకాంత్ పాల్గొన్నారు.