Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజనసంఘం జిల్లా కార్యదర్శి కొర్రా శంకర్‌నాయక్
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
రైతులను ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గిరిజనసంఘం జిల్లా కార్యదర్శి కొర్రాశంకర్నాయక్ అన్నారు.మండలంలోని అటవీసాగు రైతులుకు ఇబ్బందులు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సంఘం మండలకమిటీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ ఇస్లావత్ పాండునాయక్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములను ఆ రైతుల దగ్గరికి పోయి ఫారెస్ట్ అధికారులు మీ భూమికి పట్టా ఉందా లేదా మాకు వెంటనే ఇవ్వాలని లేనిపక్షంలో మీపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.కొంతమంది రైతుల పొలాల్లో వ్యవసాయ పనిముట్లను సైతం అడగకుండా తీసుకువెళ్లడం దారుణమన్నారు.ఫారెస్ట్ అధికారులకు గ్రామంలో ఉన్న ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మెన్, కమిటీ సభ్యులు గిరిజనసంఘం నాయకులు ఫారెస్టు అధికారులను అడుగగా సరైన సమాధానం చెప్పకుండా మా పనులకు అడ్డువస్తారా మీపై కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. రైతుసేద్యం చేసుకుంటున్న పొలాల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు పెట్టాలనే కార్యక్రమాన్ని ఆపివేయాలన్నారు. అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులు గిరిజన రైతులకు జీవించడానికి వారి అవసరాలు తీర్చుకోవడానికి పూర్తి హక్కు చట్టం కల్పిస్తుందని గుర్తుచేశారు.చట్టాన్ని లెక్కచేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకపోతే ప్రజలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎల్లాపురం తండా ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మెన్ కొర్రా దేవునాయక్, సపావట్ స్వామినాయక్, కిషన్‌నాయక్, రమావత్ వెంకట్రామ్నాయక్,కొర్రా మోతీలాల్‌నాయక్, సపవాట్ అంజినాయక్ తదితరులు పాల్గొన్నారు.