Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
చేపలు, రొయ్యలలో అధిక మాంసకృత్తులు, విటమిన్లు, అవశ్యకత అమైనోఆమ్లాలు కలిగి ఉండడంతో మత్య్స ఉత్పత్తులు సమతుల సంపూర్ణ ఆహారంగా పరిగణించబడుతున్నాయని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇన్చార్జి బి.లవకుమార్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో జాతీయ మత్య్స అభివృద్ధి మండలి వారి సహకారంతో మత్స్య పరిశోధన స్థానం, పాలేరు వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులనుద్దేశించి ప్రసింగించారు. తెలంగాణ రాష్ట్రం నీటి వనరుల్లో దేశంలోనే 3వస్థానాని కలిగి వుండి, చేపలఉత్పతిలో మాత్రం 8వ స్థానం ఆక్రమించిందన్నారు.రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం చేపల ఉత్పత్తిలో మంచి దిగుబడి సాదిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.బి.రవీందర్, మత్స్య పరిశోధనా కేంద్రం శాస్త్ర వేత్త దేశ, రాష్ట్ర చేపల ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడారు.భారతదేశం చేపలఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవస్థానంలో నిలిచిందన్నారు. కానీ భారత దేశ ప్రజలు దాదాపుగా 9 కేజీల చేపలు మాత్రమే సరాసరిగా ఒక ఏడాదికాలంలో తింటున్నారని సూచించారు.చేపలను ఆహారంగా తీసుకోవడం వలన గుండెజబ్బులు, రక్తపోటు, క్యాన్సర్, ఎముకలకు సంబంధించిన రుగ్మత రక్షించుటకు, పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల నివారణ ఉబకాయన్ని తగ్గించుటలో ప్రముఖ పాత్ర వహిస్తాయని మత్స్య పరిశోధన స్థానం పాలేరు శాస్త్రవేత్త పి.శాంతన్న వివరించారు.చేపలలో ఉండే పోషకాలు, వివిధ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీవిధానం, వినియోగం వల్ల కలిగే లాభాల గురించి కేవీకే గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త ఎన్.సుగంధి వివారించారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు కిరణ్, టి.మాధురి,దిలీప్, దామోదర్‌రెడ్డి, యువత గుర్రాల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, హుస్సేన్, సైదులు, శ్రీలత, యమున,సుకన్య, లక్ష్మీ,విజయ, శాంతకుమారి పాల్గొన్నారు.