Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
మండలకేంద్రంలోని విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ లైన్మెన్ సకాలంలో రీడింగ్ తీయకపోవడం వలన వేలకు వేలు బిల్లులు వస్తుండడంతో పేద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారనిమండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట బుధవారం పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యయాదవ్ మాట్లాడుతూ అసిస్టెంట్ లైన్మెన్ 30రోజులకు తీయాల్సిన రీడింగ్‌ను విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ 35, 40 రోజులకు రీడింగ్ తీయడం వల్ల యూనిట్‌కు రెండు రూపాయలు అయ్యే బిల్లు యూనిట్‌కు 4 రూపాయలు చొప్పున బిల్లు వేయడం వల్ల వేలల్లో బిల్లులు వస్తున్నాయని చెప్పారు.ఆయా బిల్లులు చూసుకున్న వినియోగదారులు. ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని విమర్శించారు.అదేవిధంగా వ్యాపారషాప్లలో డబ్బులు తీసుకొని కమర్షియల్ మీటర్లు ఇవ్వకుండా డొమెస్టిక్ మీటర్లు ఇస్తూ విద్యుత్‌శాఖ నిబందనలకు వ్యతిరేకంగా వ్యవరిస్తునట్లు చెప్పారు.తప్పుడు రీడింగ్‌లు తీస్తూ రూ.వేలకు వేలు బిల్లులు వేస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తు న్న అసిస్టెంట్ లైన్మెన్ను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కందుల నర్సింహారెడ్డి, దామరచర్ల ఉపసర్పంచ్ కొందరపు వీరసైదులు,మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తాళ్ళపల్లిసురేష్, ఎమ్మార్పీఎస్ మండలఅధ్యక్షులు సందాల శంభయ్యమాదిగ, వార్డు సభ్యులు దుగ్గె శ్రీనివాస్‌నాయుడు, శెట్టిపల్లివెంకటయ్య, బాలకృష్ణ, పగిడి సైదయ్య, బుడిగవెంకటేశ్వర్లు, సిపాయి పాల్గొన్నారు.