Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్పొరేట్ విద్యా సంస్థల పేరిట విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓ రోహిత్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కొర్రా సైదానాయక్ మాట్లాడారు.విద్యా హక్కు చట్టాన్ని అమలుచేయకుండా సేవాదక్పథంతో విద్యాసంస్థలు నడుపుతామని చెప్పి విద్య వ్యాపారం చేస్తున్నా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి టెక్నో డీజే, ఈ టెక్నో ఐపీఎల్ ఇంటర్నేషనల్ ఆకర్షణీయమైన పదాలతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరి స్తున్నారన్నారు.ప్రైవేట్ పాఠశా లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏ ఒక్క పాఠశాలకు ఆట స్థలం లేకుండా విద్యా హక్కు చట్టం యొక్క నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ఎంఈఓ, డీఈఓ కమీషన్లు తీసుకొని కార్పొరేట్ స్కూల్లకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చుకుంటూ వ్యవహరిస్తున్నారన్నారు కావున తక్షణమే కార్పొరేట్ స్కూల్లపై చర్యలు తీసుకొని పేద విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జగన్నాయక్, టౌన్ నాయకులు నుమాన్, దామచర్ల,వేములపల్లి మండలాల కార్యదర్శులు వీరన్న, సంపత్, నాయకులు శివ,తరుణ్, ఉపేందర్, స్వామి, మణి,నగేష్, కొండల్, రమేశ్‌బాబు, సమద్, వదూద్ పాల్గొన్నారు.