Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 102వ రోజులో భాగంగా మండలంలోని గోల్తండా నుండి మొదలుకొని వసంతపురం మీదుగా వైలసింగారం చేరుకొని గ్రామంలో నిర్వహించిన సభలో షర్మిల మాట్లాడారు. ప్రభుత్వం గడిచిన మూడేండ్ల నుండి కొత్త పెన్షన్స్ ఇవ్వకపోగా, ఇస్తున్న పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వకుండా వద్ధులను, వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తుందని వృద్ధులు ఆమెతో వాపోయారు.ఉమ్మడి రాష్ట్రంలోమాజీ సీఎం ఐదేండ్లు మాత్రమే సీఎంగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమపథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు.8 ఏండ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు కాలేదన్నారు.మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు.వైఎస్సార్ సంక్షేమపాలన కోసమే పార్టీనీ స్థాపించానన్నారు.