Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పోస్టల్ శాఖను ప్రయివేట్‌పరం చేసేందుకు యత్నిస్తుండడాన్ని నిరసిస్తూ బుధవారం పోస్టల్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లా డుతూ తపాలాశాఖలో ఉన్న 50 కోట్ల అకౌంట్లను ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు బదిలీ చేయడానికి కోసం ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.ప్రస్తుతం ఆ అకౌంట్లను ఐపీపీబీకి బదిలీ చేయడం వల్ల సుమారు రూ.6500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.ఆ మొత్తం ఆదాయం తపాలశాఖ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.ఐపీపీబీ మరింత ప్రయివేట్పర మయైం దన్నారు. పనిభారం పెరిగే అవకాశం ఉందన్నారు. తపాలాఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగులు దోమకొండ సుధాకర్, సునీత, సిరాజుద్దీన్, నాగ లక్ష్మి, ధనలక్ష్మీ, ఉపేందర్‌రెడ్డి, జరీనా, పద్మ, నాగలక్ష్మీ, గాయత్రి, సతీష్ పాల్గొన్నారు.