Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ అధ్యక్షుడు గా డాక్టర్ కేశవులు నియమితులయ్యారు..స్విట్జర్లాండ్ కేంద్రంగా ఐఎఫ్టీఏ ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. సూర్యా పేట జిల్లా నాగారం స్వగ్రామానికి చెందిన కేశవులు తెలంగాణా విత్తనా భివద్ది సంస్థ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం పొందిన కేశవులు మర్యాద పూర్వకంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశారు.ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా అంతర్జాతీయస్థాయిలో ఐఎఫ్టీఏ చైర్మెన్‌గా నియమితులైన డాక్టర్ కేశవులును ఈ సందర్భంగా మంత్రి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను విత్తన భాండా గారంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పసిద్ధికి ఐఎఫ్టీఏ తోడ్పాటునందించే విధంగా కేశవులు ముందుకు పోవాలని సూచించారు.