Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం హరితహారంపై మున్సిపల్ అధికారులు వార్డు అధికారులతో, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.ఇక నుండి వార్డు అధికారితో హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ తదితర అంశాలపై నేరుగా సంప్రదిస్తానన్నారు.వార్డు వారీగా గతేడాది హరితహారంలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఉన్న మొక్కలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.ప్రస్తుతం నిర్వహించే హరితహారంపై అధికారులు తగిన శ్రద్ధ వహించాలన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ప్రత్యేకాధికారులు, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.