Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ-బీబీనగర్
విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం మండలపరిధిలోని జమీలాపేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బోధన్ డే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు గట్టిగా అందరికి వినబడేటట్టు చదివితే భాష దోషాలను నివారించవచ్చన్నారు. విద్యార్థులు భాషా నైపుణ్యాన్ని పెంపొందించు కోవాలని కోరారు. అనంతరం పాఠశాలను సందర్శించి, పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. అంతకుముందు విద్యార్థులు పూలబొకేలతో కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ తివారి, జిల్లా విద్యాధికారి నర్సింహా, ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌గౌడ్, జెడ్పీటీసీ గోళి ప్రణీతపింగల్రెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రేమలత సుభాశ్‌రెడ్డి, ఎంపీటీసీ ఎరుకలి విజయలక్ష్మీపాండు రంగంగౌడ్, ఎంపీడీఓ శ్రీవాణి, ప్రధానోపాధ్యాయు రాలు గీతస్వరూపరాణి, ఎస్ఎంసీ చైర్మెన్ లలిత పాల్గొన్నారు.
బ్యాంకుల సమన్వయ సంప్రదింపుల కమిటీ సమావేశం
భువనగిరి రూరల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుదవారం బ్యాంకు సమన్వయ సంప్రదింపుల కమిటి సమావేశానికి కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 కు, సెర్ప్ కు గాను 103 శాతం , మెప్మా కు గాను 109 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సకాలంలో రుణాలు మంజూరు చేసి వాళ్ల ప్రగతికి తోడ్పడాలని అన్నారు. ఈ ఏడాది బ్యాంక్ రుణ ప్రణాళిక లక్ష్యాన్ని 3356.48 కోట్ల గా నిర్ధేశించి , అందులో ప్రాధాన్యత రంగాలకు 3183.28 కోట్లు, అధిరప్రాధాన్యత రంగాలకు 173.20 కోట్లుగా కేటాయింపులు జరిపాలని నిర్ణయించినట్టు తెలిపారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ,పంట రుణాలు కింద 2707.75 కోట్లు ఇవ్వాలనిలక్ష్యంగా నిర్ణయించిన్నట్టు తెలిపారు. బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళికను ఈ సందర్బంగా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎల్ డిఎం రామ కష్ణ, ఎల్ డి ఓ,(ఆర్బిఐ) పూర్ణిమ, నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, డీఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, ఎస్టీ కార్పొరేషన్ జిల్లా అధికారి మంగతా నాయక్, ఎస్బీఐ ఆర్ఎం.కృష్ణ మోహన్, ఏపీజీవీబీ ఆర్ఎం బివి.రావు, తదితరులు పాల్గొన్నారు.