Authorization
Sun March 30, 2025 03:20:32 am
చండూరు:స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం జెడ్పీసీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పల్లె ప్రగతి, ఉపాధి హామీపనులు, హరితహార పై రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో బాధ్యత వహించి, సమయపాలన పాటించి మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు.మొక్కలపై నిర్లక్ష్యం చేయకుండా పలు జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈ సమా వేశంలో ఎంపీడీవో జానయ్య, ఎంసీఓ స్వరూపరాణి, మండల పంచాయతీరాజ్ ఏఈ రమేష్, మండల ఇంజనీరింగ్ అధికారి, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.