Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ-సూర్యాపేట
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక 27వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండ్ల ముందు గాబుల లో నిల్వ ఉన్న నీటిని తొలగింపజేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు వారానికి ఒక రోజు డ్రైడే నిర్వహించి తమ ఇంటి ముందు గాబూల్లో, పాత కొబ్బరిబోండాలు టైర్లలో నీరు నిల్వ ఉండకుండా తొలగించుకోవాలన్నారు. 120 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను నిషేధించినందున ప్రతి ఒక్కరు చేతిసంచిని వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వార్డు కౌన్సిలర్ శిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ , మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శివప్రసాద్, వార్డు నాయకులు శిరివెళ్ల శబరి, గ్రీన్ క్లబ్ సభ్యులు ముప్పారపు నరేందర్, డాక్టర్ తోట కిరణ్, జవాన్ వేణు తదితరులు పాల్గొన్నారు.