Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండకలెక్టరేట్
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల తగాదాల వల్ల మూతబడిన రైస్ మిల్లులను తెరిపించి హమాలీలను ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ఎఫ్సిఐ అధీనంలో కొట్ల కొద్ది మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను నిల్వచేసే సామర్థ్యం గల గోదాములు ఉన్నప్పటికి నిల్వ ధాన్యాలను కొనుగొలు చేయకుండా ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వ ఆటలో కీలుబొమ్మగా మారిందని అన్నారు. ఇదే తరహలో రాష్ట్ర ప్రభుత్వా తీరుందన్నారు. లేవి విధానంతో రెస్ మిల్లు ఇండిస్టీ పూర్తిగా నాశనమైందనారు. ఏటా కోటీి 38లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాని సేకరిస్తున్నామని చెబుతూనే పేదలకు ఉచితంగా అందించే రేషన్ బియ్యాన్ని 2 నెలల పాటు ఇవ్వకుండా రాష్ట్ర గోదాములలో నిల్వచేసుకొని పేదల కడుపు కొట్టిందనారు. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకుంటు రైస్ మిల్లులు మూతపడటంలో తమ తప్పు కాదన్నట్లుగా ,లేదన్నట్లుగా వ్యవహరిస్తూన్నారని ఆరోపించారు. నిల్వలతో నిండి మూసివేతలకు గురైన రైస్ మిల్లులలోని కస్టమ్ మిల్లింగ్ బియ్యని తక్షణమే ఎఫ్సిఐ కొనుగోలు చేయాలని,గత నెల రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరితో ఉపాది కొల్పోయిన ప్రతి కార్తికునికి రూ.20 వేల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ' ఉపాధ్యక్షులు ఎండి.సలీం' తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కోశాధికారి సాగర్ల యాదయ్య, అద్దంకి నర్సింహ, నెలగొంద రాసి లింగయ్య, నకరికంటి సుందరయ్య, జిల్లల సుధాకర్ రెడ్డి, కొండ్ర సైదులు, బురకల నరసింహ, దొమ్మాటి యాదగిరి, కారింగు బిక్షం ,పల్లె నగేష్, మాండ్ర శ్రీను, గుల్షన్ ,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : సిఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసి, మూతపడ్డ మిల్లులను తెరిపించి రైస్ మిల్లు కార్మికుల కు ఉపాధి కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో డీఏఓ రాధాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, హమాలి వర్కర్స్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కష్టమెల్లింగ్ బియ్యం నిలుపుదల చేసిందని దీనివల్ల వందలాది రైస్ మిల్లులు మూతపడ్డాయన్నారు. లక్షలాది మంది హమాలీలకు ఉపాధి కరువైపోయిందని వాపోయారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సిఎం ఆర్ కోసం ఎఫ్సిఐ ద్వారా బియ్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, నాయకులు గుణగంటి రాంచంద్రు, గాదె పద్మ, కుమ్మ సుధాకర్, గలయ్య, అంజయ్య, వెంకట్ రెడ్డి, కోటిరెడ్డి, రామలింగం, నాగార్జున, బి.వెంకన్న, ఆర్.సోమయ్య తదితరులు పాల్గొన్నారు