Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
అప్రకటిత కరెంట్ కోతలను ఎత్తివేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జిట్ట నగేష్,అవిశెట్టి శంకరయ్య లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంతోపాటు , ఆరెగూడెం గ్రామంలో విద్యుత్ సబ్ స్టషన్ల ఎదుట శుక్రవారం ఆ పార్టీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి కరెంటు తగినంత ఇవ్వకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం సబ్ స్టేషన్ సబ్ ఇంజనీర్ నరీన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి అరూరి శీను,రైతు సంఘం మండల అధ్యక్షులు లడే రాములు ,సుర్కంటి బుచ్చి రెడ్డి,చిన్నబోయిన గట్టయ్య,పల్లపు పెంటయ్య,సిపిఎం నాయకులు జిట్ట సరోజ,పామనుగుల్ల జయమ్మ, అరూరి శంభయ్య పేర్వారం రాములు ,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.