Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్
నవతెలంగాణ- కోదాడరూరల్
దేశాన్ని దివాలా దిశగా మారుస్తూ ఎల్ఐసి ఎయిర్ ఇండియా రైల్వే లాంటి వాటిని కార్పొరేట్ శక్తులకు చేయాలని చూస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎద్దేవ చేశారు.శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి టూరిస్టులు 119 నియోజకవర్గాల్లో నాయకులు లేక దేశంలోని ఇతర రాష్ట్రాల నాయకుల్ని తెలంగాణ రాష్ట్రంలోకి డబ్బు సంచుల ద్వారా గ్రామాల్లోకి వెళ్లి జన సమీకరణ కోసం డబ్బులు పంచుతూ గారడి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల సంవత్సరాలు గడిచినప్పటికీ విభజన చట్టాలను నెరవేర్చకపోగా తెలంగాణ రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం విషం చిమ్ముతుందని ఘాటుగా విమర్శించారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణ విభజనపై వెకిలి మాటలు మాట్లాడిన మోదీ తెలంగాణ అభివద్ధిని చూడాలని కోరారు. రాష్ట్రం కేంద్రానికి 3060 కోట్లు పన్ను రూపంలో చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు లక్ష అరవై ఐదు వేల కోట్లు మాత్రమే పంపిందన్నారు. తెలంగాణ వాటా దనాన్ని కేంద్రం వాడుకుంటుంది గాని కేంద్రం తెలంగాణకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. తెలంగాణకు నవోదయ పాఠశాలలు బయ్యారం ఉక్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ సిమెంట్ కర్మాగారం తదితర ప్రాజెక్టులు తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా కేంద్రం నేటికి వాటిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ ప్రాజెక్టులపై చర్చించి తెలంగాణకు ఇవ్వాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లారెడ్డి, ఎంపీపీ చింత కవితరాదారెడ్డి, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, జిల్లా రైతు సంఘం నాయకులు ఈదులు కష్ణయ్య యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, గ్రంథాలయ చైర్మన్ రహీం, వార్డు కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ యాదవ్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్, నాయకులు గంధం పాండు ,బత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.