Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులుచెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -వలిగొండ
మూసీ కాలుష్యం విముక్తి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోటీిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల వాగ్దానాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూసీ కాలుష్యాన్ని అరికడతామని ప్రక్షాళన చేస్తామని అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించి మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. శుక్రవారం స్థానిక శివశక్తి ఫంక్షన్ హాలులో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అద్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ ప్రక్షాళనకు అసెంబ్లీ బడ్జెట్లో రూ.16,600 కోట్ల ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు చేసింది లేదన్నారు. మూసీ కాలుష్య నియంత్రణ మండలి ఉన్నా పేరుకు మాత్రమే పరిమితమయిందన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్న మూసీ నీటిని శుద్ధి చేయడం కోసం నిధులు కేటాయించడం లేదన్నారు .రాష్ట్రవ్యాప్తంగా 31 మురికినీటి శుద్ధి కేంద్రాలు ఉన్నా కేవలం 5 మాత్రమే పనిచేస్తున్నాయని, మూసీ కాలుష్యానికి ప్రధానంగా విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ఫార్మా కంపెనీలు విడుదల చేసిన కాలుష్యాన్ని మూసీ కాలువలో కలపడం వల్ల కాలుష్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వం మూసీ కాలుష్యంపై నిరంకుశంగా వ్యవరిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోందన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ మాట్లాడుతూ హిమాయత్ సాగర్ హుస్సేన్ సాగర్ లను శుద్ధిచేసి కొండపోచమ్మ డ్యాంలో కలుపుతామని మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వ్యవసాయం దిగుబడులు తగ్గడం వల్ల రైతాంగం పూర్తిగా సంక్షోభంలో పడుతుందన్నారు. మూసీ వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గాయని ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వస్తున్న గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించాలని, గంధమల్ల రిజర్వాయర్ పనులను వెంటనే ప్రారంభించాలని,గోకారం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీని ధ్యారా రామన్నపేట మండలం వరకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.గంధమల్ల రిజర్వాయర్ ద్వారా ఐదువేల ఐదువందల ఎకరాల భూమి సాగు ఆవుతుందని తెలిపారు. బునాధిగాని చెరువును మినీ రిజర్వాయర్ గా మార్చి గోదావరి నీరును నింపాలని ఈ చెరువు ద్వారా ఆత్మకూరు,గుండాల,మోత్కుర్, అడ్డగూడూరు మండలాలకు నీరు అందించాలని కోరారు. వలిగొండ నుండి మోత్కుర్ వరకు ఉన్న రోడ్డు దారుణంగా తయారు అయ్యి ప్రమాదాలు జరుగుతుంటే కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరు బాలరాజు,కల్లూరి మల్లేశం,దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కష్ణ,బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య,ఎండి పాషా,జల్లెల పెంటయ్య,బూర్గు కష్ణారెడ్డి, పగిళ్ళ లింగారెడ్డి, బొడ్డుపల్లి వెంకటేష్, గుంటోజు శ్రీనివాస్ చారి, గుండు వెంకటనర్సు,గంగాదేవి సైదులు, బండారు నర్సింహ, దొడ యాదిరెడ్డి, బోలగాని జయరాములు, అవ్వరు రామేశ్వరీ, రాచకొండ రాములమ్మ, ఇక్బాల్, వెంకటేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.