Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కట్టడికి వైద్యులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకం
నవతెలంగాణ -నకిరేకల్
ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. అనారోగ్యం బారిన పడిన వారికి పునర్జన్మనిస్తున్న వైద్యులే సమాజం లో అసలైన హీరో లని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. శుక్రవారంజాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు డా.మోహన్ రెడ్డి, డా.రఘునందన్-మంజుల, డా.వీరబ్రహ్మం, డా.గౌతమ్ రెడ్డి , డా.వెంకటరమణ గోలి, డా.సాయిప్రణవ్, డా రమేష్, డా. వేణుగోపాల్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమిస్తున్న వైద్యులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై బార్డర్ లో సైనికుల వలే వైద్యులే ముందుండి పోరాటం చేసి, ప్రాణాలను అర్పించారన్నారు. సమస్త ప్రాణకోటిని కాపాడే ఆ భగవంతుడిని సైతం మహమ్మారి కొన్నాళ్లు భక్తులకు దూరం చేసినా.. తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.