Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ హరిత
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
మన ఊరు మన బడి, మనబడి మనబస్తి, గ్రౌండింగ్ పూర్తిచేసిన పాఠశాలలో పనులు వేగంగా పూర్తిచేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రటరీ హరిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించడానికి నేడు జిల్లాలో పర్యటించినట్లు ఆమె తెలిపారు. జిల్లాలలో కొన్ని పాఠశాలలో ప్రజా ప్రతినిధులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ల సహకారంతో పనులు ప్రారంభించి సమర్థవంతంగా జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నిర్ధేశించిన సమయానికి అన్ని హంగులతో పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ఆమె ఆదేశించారు. మండలాలలో గుర్తించిన పాఠశాలలకు మరమ్మతులు ఇతర పనులకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈజీఎస్ ద్వారా చేపట్టే పనులకు, అలాగే మన ఊరు , మన బడి పథకం ద్వారా చేపట్టే పనులకు వేర్వేరుగా ప్రతిపాదనలు ఉండాలని చెల్లింపులు కూడా అదేవిధంగా జరగాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల పనుల విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని అధికారులను కోరారు. పాఠశాలలో ఇంకా ఇతర మౌలిక సౌకర్యాల కోసం అదనపు తరగతి గదుల ప్రతిపాదనలు ఉంటె సాంకేతిక సమస్యల గురించి లేఖను జిల్లా కలెక్టర్ ద్వారా పంపించాలని ఆమె అధికారులకు సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలో పనుల విషయంలో ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే తన దష్టికి తీసుకురావాలని ఇంజనీర్లను ఆదేశించారు. పాఠశాలల పనుల్లో పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు తనకు పంపించాలని డీఈఓ ను ఆదేశించారు. ఇంజనీర్లకు వెబ్సైట్ ఆన్లైన్ నమోదు విషయంలో ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశం లో విద్య శాఖ అదనపు డైరెక్టర్ రమణ కుమార్, అదనపు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రమేష్, డి.ఈ. ఓ.భిక్షపతి, పి.ఆర్.ఈ ఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల అభివద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి.పనులలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు
సూర్యాపేట కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు -మన బడి పథకం కింద జిల్లాలో మొదటి విడతలో మంజూరైన 329 పాఠశాలల్లో పలు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్య శాఖ జాయింట్ సెక్రటరీ హరిత అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో మనవూరు మన బడి పథకం కింద మంజూరై చేపట్టిన పనులపై విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంకి అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలసి మాట్లాడారు. జిల్లాకు ఇప్పటికే రెండు కోట్లు రూపాయలు అడ్వాన్స్ గా అందించామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను లోబడి సూచించిన 12 అంశాలకు లోబడి పనులు ఉండాలని, చెల్లింపులలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 90 పాఠశాలలో పనులు జరుగుతున్నాయని మిగతా పాఠశాలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే సత్వరమే పరిశీలించి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలల అభివద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జిల్లాలోఎంపిక చేసిన పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యకమిటీ ఛైర్మన్ లు, సహాయక ఇంజినీర్లు, ఈఈలు, డీఈఈ లు, ఎంఈఓ లు, ఎంపికైన పాఠశాలల అభివద్ధికి సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. అనంతరం ఎంపికైన పాఠశాల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు.పాఠశాలల పనులపురోగతి, సాంకేతిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్య శాఖ ఏ ఎస్ పి డి.రమేష్, డి ఈ ఓ.అశోక్, ఈఈ టిడబ్ల్యూ ఐ డి సి.అనిత, ఈ ఈ పి.ఆర్. శ్రీనివాస రెడ్డి, ఎస్ ఏం సి. కమిటీ సభ్యులు, ఏం ఈ ఓ లు, హెచ్ ఎంలు, సంబంధిత శాఖల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.