Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం తహసీిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ మండలంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు దళిత బంధు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని మాట తప్పి నేడు రూ. మూడు లక్షలు మంజూరు చేస్తామన్న ప్రకటనను సైతం విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ ప్రసాద్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకన్న, టౌన్ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, రైతు జిల్లా సంఘం ఉపాధ్యక్షులు యానాల కష్ణారెడ్డి, మండల కమిటీ సభ్యులు కొప్పుల అంజయ్య, పుట్టా సత్తయ్య, లక్ష్మీ నరసయ్య, పాలడుగు పరమేష్, అక్కెనపల్లి సైదులు, టౌన్ మహిళా సంఘం నాయకులు బహురోజ్ ఇందిర, సిహెచ్.నాగమణి, పన్నాల శశికళ, గండమల్ల బాలస్వామి, ప్రవీణ, ఇందిర, జమదగ్ని పాల్గొన్నారు.