Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్ :నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ రోడ్డు కు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం కడపర్తి రహదారిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ చిన్నపాటి వర్షాలకే కడపర్తి రహదారి గుంతల మయంగా మారడంతో నీళ్లు నిలిచి బురదమయంగా మారుతుందన్నారు. వర్షాకాలంలో గుంతలలో నీరు నిలవడం వల్ల రహదారి వెంబడి ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిలోనే తహసిల్దార్ కార్యాలయం, మార్కెట్ కార్యాలయం, ఫైర్ స్టేషన్, గురుకుల పాఠశాల ఉన్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. వెంటనే గుంతలను పూడ్చి రహదారికి మరమ్మత్తులు చెయ్యకపోతే ఆందోళనను ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి వంటే పాక వెంకటేశ్వర్లు, నాయకులు, చెన్నబోయిన నాగమణి, యానాల కృష్ణారెడ్డి, బి ప్రకాష్ రావు, ఒంటె పాక కష్ణ, జి బాలస్వామి, పన్నాల శశికళ, గింజల లక్ష్మీ, రామ్ రెడ్డి, శ్రీనివాస్, ఇందిరా పాల్గొన్నారు.