Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధుపై కలెక్టర్కు ఫిర్యాదు
- 50 వేల మెజారిటీతో గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తా
- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -కోదాడరూరల్
మండలంలో దళిత బంధు పథకం పూర్తిగా అవినీతిమయ్యిందని ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గుడిబండ, కాపుగల్లు, ఎర్రవరం, రామలక్ష్మీపురం, బిఖ్యాతండ, గణపవరం, తోగర్రారు, అడ్లూరు గ్రామాలలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో గ్రామస్తులు దళిత బంధు లో నాయకులు లబ్ధిదారుల నుండి రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ఖు ఫోన్ చేసి స్థానిక నాయకులపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాల మాదిగల వద్ద లంచాలు తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు నుండి విజయవాడకు ఆరు వరుసల రహదారి మంజూరు కోసం గట్టిగా ప్రయత్నించి మంజూరు చేపించినాను త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. గుడిబండ గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయంలో 400 ఇల్లు కట్టించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ఇండ్లు కూడా కట్టించలేదని విమర్శించారు.ఇప్పుడున్న దుష్ట పరిపాలనలో కాంగ్రెస్ కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులన్నీ తమకు తెలుసునని తాము అధికారంలోకి వచ్చినాక అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. జీఎంఆర్ సమస్త వాళ్ళు ఒప్పుకొని సందర్భంలో కేంద్రాన్ని ఒప్పించి త్వరలోనే ఆరు లైన్లో రహదారిలో పనులు చేపట్టానున్నారు. కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 50వేల మెజార్టీతో గెలవడం ఖాయం అని లేనిపక్షంలో రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. త్వరలోనే నేరేడుచర్ల కోదాడ ,హుజూర్నగర్ మీదుగా రైల్వే లైన్ సర్వే మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో గుడిసవాసులు సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెలది పద్మావతి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని విన్నవించుకున్నారు. స్పందించిన ఎంపీ గుడిసె వాసుల నివాస గృహాలను పరిశీలించారు. సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మినారాయణ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తుమాటి వరప్రసాద్ రెడ్డి,మండల అధ్యక్షుడు పాలకి అర్జున్, పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, , బాగ్దాద్, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటా చారి, కాసాని రామారావు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన మండల మైనార్టీ నాయకులు
మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో సోమవారం రాత్రి టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు లాలు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పార్టీలో చేరిన లాలు మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను చూడలేక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సర్పంచ్ కొండా శైలజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురవయ్య, కొండా పూర్న చంద్రరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.