Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-సూర్యాపేట
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని రాష్ట్ర ఫొటో అండ్ వీడియో , గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈనెల 7 మరిపెడ బంగ్లా జిల్లా కేంద్రంగా ఫొటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్య ంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం స్థానిక లక్ష్మి దుర్గ స్టూడియోలో ఆయన ఆవిష్కరించి మాట్లా డారు. ఫొటోగ్రాఫర్స్ ఎప్పుడు పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ క్రీడల వలన ఫోటోగ్రాఫర్ల మధ్య స్నేహ భావం, మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9 జిల్లాల స్థాయిఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ లు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ఉమ్మడి వరంగల్ ,ఉమ్మడి ఖమ్మం ,ఉమ్మడి నల్గొండ జిల్లాల ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల అధ్యక్షుడు బోడుపట్ల లింగన్న, కార్యదర్శి గుండా దశరథ, కోశాధికారి పొన్నం శ్రీకాంత్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.