Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-చౌటుప్పల్
ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌చేస్తూ ఆలిండియా ఆశాల డిమాండ్స్ డే సందర్భంగా ఈ నెల 18న పీహెచ్‌సీల వద్ద 26న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కల్లూరి మల్లేశం ఆశా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని పీహెచ్సీలో ఆశాలతో కలిసి ధర్నాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడారు. ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం ఏపీలో ఇస్తున్నట్టుగా ఇవ్వాలని, 2021 జులై నుండి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, కేంద్రం చెల్లించిన 16 నెలల రిస్క్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన ఆశా కార్యకర్తలకు కేంద్రం ప్రకటించిన 50 లక్షల ప్రమాద భీమాను వర్తింపచేయాలని డిమాండ్‌చేశారు. ఆశా కార్యకర్తలు ధర్నాల్లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి, సహాయకార్యదర్శి ఎమ్‌డి.పాషా, మండల కన్వీనర్ ఆదిమూలం నందీశ్వర్, కో ఆప్షన్ సభ్యులు మదార్, ఆశా నాయకులు పద్మశ్రీ, జ్ఞానేశ్వరి, లక్ష్మీ, ఫర్హాత్, సుజాత, శ్రీలత పాల్గొన్నారు.
సంస్థాన్‌నారాయణపురం : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కల్లూరు మల్లేశం సిఐటియు జిల్లా కోశాధికారి దోనూరు నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎండి పాషా డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆశ వర్కర్ల యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న సబ్ సెంటర్ల ముందు నిర్వహించే ధర్నాలో అధిక సంఖ్యలో ఆశలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆశ కార్యకర్తల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఆశా కార్యకర్తలు మల్లెపల్లి పద్మ, జక్కలి పద్మ చింతకాయల మంగమ్మ, డి ధనలక్ష్మి డి సరిత, రాచకొండ నాగమణి తదితరులు పాల్గొన్నారు.