Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ- నల్గొండకలెక్టరేట్
కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల సందర్భంగా జిల్లాల్లో ఈ నెల 11న కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కాకతీయ వైభవ సప్తాజమంఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 13 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నట్లు, అందులో భాాగంగా ఈ నెల 11న నకిరేకల్ మండలం చందుపట్లలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. చందుపట్లలో కాకతీయ రుద్రమదేవి మరణ కాలాన్ని ప్రస్తావిస్తూ ఏర్పాటుచేసిన చందుపట్ల శిలాశాసనం ఉన్నందున, ఇది కాకతీయుల పరిపాలన సంబంధించిన అతి ముఖ్యమైన అరుదైన శాసనంగా ఆయన పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, స్థానికంగా స్టేజి,ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో డీఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డీఈఓ బిక్షపతి, డీపీఆర్ఓ శ్రీనివాస్, జిల్లా క్రీడలు,యువజన అధికారి మక్బూల్ అహ్మద్, ఎస్పీసీడీసీఎల్ డిఈ విద్యా సాగర్,కలెక్టరేట్ పరిపాలన అధికారి మోతి లాల్,నకిరేకల్ ఎంపీడీఓ వెంకటేశ్వర్ రావు,తహసీల్దార్ పాల్గొన్నారు.
ఈవీఎంలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గల ఈవియం గోదాం లలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల ననుసరించి మూడు నెలల కొకసారి తనిఖీలో బాగంగా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ రాజకీయ పక్షాల సమక్షంలో మంగళ వారం తనిఖీ నిర్వహించారు.ప్రతి మూడు నెలలకొక సారి రాజకీయ పక్షాల సమక్షంలో ఈవీఎంల లీకేజీలు, స్థితిగతులు తనిఖీ చేశారు. తనిఖీ నివేదిక ఎన్నికల సంఘంకు పంపించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఅర్ఓ జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్ కష్ణమూర్తి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, ఎన్నికల డీటీవిజరు. టీిఆర్ఎస్ నాయకులు పిచ్చయ్య. సీపీఐ(ఎం) నాయకులు నర్సిరెడ్డి. టీడీపీ నాయకులు సత్యనారాయణ. ఐ ఎన్ సి నాయకులు అశోక్. బిఎస్పీ నాయకులు యాదగిరి. ఎంఐఎం నాయకులు రజియోద్దీన్. తదితరులు పాల్గొన్నారు.