Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-మిర్యాలగూడ
కడవరకు ఎర్రజెండా నీడలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరుడు మహమ్మద్ భారు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు. సీఐటీయూ జిల్లా నాయకులు మహమ్మద్ బీన్ సయ్యద్ ద్వితీయ వర్థంతి సందర్బంగా మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ భారు కార్మికుల హక్కుల కోసం, ప్రభుత్వలు అవలంభించే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద కార్మికులను సమీకరించి పోరాడరాని వారి పోరాట త్యాగాలను స్మరించుకున్నారు. మిర్యాలగూడ పట్టణం చుట్టూ పక్కల ప్రాంతాలలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్పందించి పోరాడి మహమ్మద్ భారుగా అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలిపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఆ పార్టీ వన్ టౌన్ కార్యదర్శి మల్లు గౌతమ రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, బావండ్ల పాండు, ఎండి. అంజద్, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమడల పరుశురాములు, సీనియర్ నాయకులు పగిడోజు రామూర్తి, సీఐటీయూ నాయకులు రాంచంద్రు, లక్ష్మీనారాయణ, బిఎం.నాయడు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లుట్ల సైదులు, రామారావు, వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.