Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దామరచర్ల:పెంచిన బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దామరచర్ల మండలం లోని ఆదర్శ పాఠశాల ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు . దామచర్ల నుండి ఆదర్శ పాఠశాలకు గతంలో నెలకు రూ.150 ఉన్న బస్సు పాస్ ఇప్పుడు రూ.350 పెరగడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు మధ్యలో ఉన్న ఆపేసి పరిస్థితి వస్తుందన్నారు .తక్షణమే పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ధీరవత్ వీరన్న ,సంపత్ , నవ్య, రోజా ,అశొక్ ,కళ్యాణ్ రామ్ ,అంజలి ,సంతొష్ , రమేష్ ,రేణుక, రావణ్ సిద్ధార్థ, పవన్ తదితరులు పాల్గొన్నారు.