Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవ తెలంగాణ- చివ్వేంల
ఖాళీ స్థలాలలో మొక్కలను పెంచాలని కలెక్టర్ వినరు కృష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమలగిరి గ్రామంలో అంగన్ వాడి కేంద్రం, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, గ్రామాలలోని వీధులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాలలో మొక్కలు పెంచాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీ రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు వంద రోజులు పనులు కల్పించాలని, వారికి సకాలంలో బిల్లు వచ్చే విదంగా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రామాలను మొక్కలతో నింపాలని, ప్రతి ఇంట్లోపనికిరాని వస్తువులను గ్రామ పంచాయతీ ద్వారా సేకరించాలని అధికారులకు తెలిపారు. గ్రామంలో ఎక్కడ అపరిశుభ్రత కనిపించకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీవో గోపి, ఏపిఓ నాగయ్య, సర్పంచ్ కంచర్ల నిర్మల గోవిందరెడ్డి, ఉపాధిహామీ సిబ్బంది, అధికారులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.