Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజాయి నిందితులు ఇద్దరు అరెస్టు 60 గంజాయి ప్యాకెట్ల (120 కిలోలు), రూ. 7 లక్షల నగదు, కారు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ -నల్లగొండ
గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఉన్న వారి వద్ద నుండి 60 గంజాయి ప్యాకెట్ల (120 కిలోలు) , సుమారు రూ.7 లక్షల నగదు,కారు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నకిరేకల్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున నకేరేకల్ పీఎస్ పరిధిలోని ఎన్హెచ్ 65 లోని నగేష్ హోటల్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనంలో వెతికి వారి వద్ద నుండి గంజాయి ప్యాకెట్లు (60) స్వాధీనంచేసుకున్నారు. వారిని పట్టుకుని విచారించగా సంగారెడ్డి జిల్లాకు చెందిన రాథోడ్ మోహన్ గతంలో గంజాయి రవాణా చేస్తూ ఆంధ్రా ప్రాంతంలో పట్టుబడి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వెళ్లారు. అక్కడ మందలంక ప్రవీణ్ సెంట్రల్ జైలులో పరిచయం అయ్యాడు. అప్పటి నుండి రాథోడ్ మోహన్ కోర్ట్ పేసీలకు హాజరయ్యే క్రమంలోఅనకాపల్లి వడ్డాడి గ్రామానికి చెందిన దేవేందర్ పరిచయం చేసుకున్నాడు .ఈ విషయం ప్రవీణ్ కి తెలియజేసి ముగ్గురు కలిసి గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవేందర్ అనకాపల్లి నుంచి రాథోడ్ మోహన్, మందలంక ప్రవీణ్ తక్కువ దరకు తీసుకొచ్చి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 60 గంజాయి పాకెట్స్ (120 కిలోలు), కారు,రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని వారిపై (Cr.No.162/2022 బ/ర 8 తీ/ష 20(b)(ఱఱ) (ష) NDPS చట్టం, 1985) కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్టు తెలిపారు. ఈ కేసు ఛేదించిన టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మోగిలయ్య, నల్గొండ డీఎస్పీ నరసింహ రెడ్డి పర్యవేక్షణలో నకేరేకల్ సీిఐ వెంకటయ్య ఎస్ఐలు శంకర్, రంగా రెడ్డి,గోపి కృష్ణ, సిబ్బంది ,టాస్క్ ఫోర్స్ బందాన్ని అభినదించారు.